మరో 3 రోజులు భారీ వర్షాలు కురువనున్నాయి. అవసరమైతే తప్పా బయటికి రావద్దు. నడిచేటప్పుడు మ్యాన్ హోల్స్, విద్యుత్ స్థంభాలను చూసుకొని నడవాలి. ఇనుప దండాల పై బట్టలు ఆరేయవద్దు. చెట్ల కింద నిలబడొద్దు. పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది. రైతులు, ఇళ్లలో ఉండేవారు విద్యుత్ సమస్యలుంటే అధికారులకు చెప్పాలి కానీ స్వతహాగా రిపేర్ చేయవద్దు. పాములు, విషకీటకాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. చేపల వేటకు వెళ్లొద్దు. జలాశయాల వద్ద జాగ్రత్త.