చామ కూర, చామ గడ్డతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వీటి వినియోగం వల్ల రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. చామ కూరలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తి అందించడంతోపాటు బరువు నియంత్రణలోకి వస్తుంది. చామ ఆకుల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఎముకలను ధృడంగా ఉంచుతుంది.