కిడ్నీ సమస్యలు ఉన్నవారికి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గిపోయి కండరాలు, మెదడు బలహీనపడతాయి. రక్తంలో మలినాలు, వ్యర్థాలు పేరుకుపోతాయి. నాలుక రుచిని కోల్పోతుంది. కీళ్లు, చేతులు, పాదాలు ఉబ్బుతాయి. చర్మం పొడిబారుతుంది. మూత్రంలో మంట, మూత్రం రంగు మారుతుంది. ఇలాంటి సమస్య కనిపించినప్పుడు మీరు తక్షణమే వైద్యులను సంప్రదించాలి.