ఎండాకాలంలో మన శరీరానికి చల్లదనాన్నిచ్చే పదార్థాల్లో సగ్గుబియ్యం కూడా ఒకటి. సగ్గుబియ్యంలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అవన్నీ వేసవిలో మనల్ని ఎండ నుంచి రక్షిస్తాయి. అంతేకాకుండా పలు అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. సగ్గుబియ్యంతో మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సగ్గుబియ్యంలో పాలు, చక్కెర పోసి వండుకుని తింటే శరీరానికి చలువ చేస్తుంది. ఉప్మా తరహాలో సగ్గుబియ్యం తిన్నా ప్రయోజనం ఉంటుంది. సగ్గుబియ్యం తింటే ఎండలో తిరిగే వారికి ఉపశమనం కలుగుతుంది. వేసవి తాపం నుంచి తప్పించుకోవచ్చు. సగ్గుబియ్యం తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. సగ్గుబియ్యం తింటే జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. వేసవిలో కొంచెం పనిచేసినా మనం త్వరగా అలసిపోతాం. కనుక శరీరంలో శక్తి త్వరగా తగ్గుతుంది. అలాంటి వారు సగ్గు బియ్యం తింటే వెంటనే కోల్పోయిన శక్తి తిరిగి పొందొచ్చు.