విశాఖపట్నంలో వృద్ధురాలిని వాలంటీర్ చంపేస్తే అధికార పక్షం నుంచి స్పందనే లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ‘‘వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేయడం దురదృష్టకరం. గతంలో మహిళల మిస్సింగ్‌పై చెప్పిన గణాంకాలు నేను చెప్పినవి కావు. అలానే రౌడీషీటర్‌కు ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసే ధైర్యం ఎక్కడిది? నాపై ఆంక్షలు పెడుతున్నారు కానీ నేరగాళ్లకు ఎలాంటి ఆంక్షలు లేవు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.