ప్రపంచవ్యాప్తంగా నమోదైన కోవిడ్ -19 కొత్త కేసుల సంఖ్య గత నెలలో 80 శాతం పెరిగింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) శుక్రవారం వెల్లడించింది. కోవిడ్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ కాదని WHO మే నెలలో ప్రకటించింది. అయితే వైరస్ వ్యాప్తి చెందడం, కొత్త సబ్‌వేరియంట్ల రూపంలో పరివర్తన చెందడం కొనసాగుతుందని WHO తాజాగా పేర్కొంది. కోవిడ్ వల్ల ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతాయని హెచ్చరించింది.