ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి రాజకీయ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సభల్లో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పుంగనూరులో పోలీసులపై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. పోలీసు వ్యవస్థ అందరికోసం పనిచేస్తుందని రాజకీయ పార్టీలు గుర్తించి సహకరించాలని కోరారు.