కృష్ణా నదిలో లాంచీ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. గుంటూరు జిల్లా రాయపూడి నుంచి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మధ్య ఈ లాంచీలు నడుస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం జరిగిన గోదావరి పడవ ప్రమాదం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లాంచి సేవలను నిలిపివేశారు. అప్పటినుంచి మూతపడిన లాంచీ సేవలు తాజాగా శుక్రవారం నుంచి పునరుద్ధరించామని లాంచీల నిర్వాహకులు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటాయన్నారు.