తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం వాసవిసేవాదళ్ అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో స్థానిక బోసురోడ్డులోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో తెనాలి పట్టణ ఆర్యవైశ్య లీగల్ సెల్ సహకారంతో 13-8-23న ఆదివారం న్యాయ శిబిరం నిర్వహించనున్నారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భాస్కరుని శ్రీనివాసరావు న్యాయ శిబిరం వివరాలను వెల్లడించారు.