శీతాకాలంలో తరచూ జీర్ణ సమస్యలు ఎదురవుతుంటాయి. చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కడికీ కదలకుండా స్థిరంగా ఉండడం, తక్కువగా నీళ్లు తాగడం, కూల్ డ్రింక్స్, బయట ఆహారం ఎక్కువగా తినడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల జీర్ణ వ్యవస్థ పని తీరు మందగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం చేయడం, కాచి చల్లార్చిన నీటిన తగినంత తీసుకోవడం, పౌష్టికాహారం, ఆకుకూరలు తినడం, శరీరాన్ని సాధ్యమైనంత వరకూ వెచ్చగా ఉంచేలా చూడాలని పేర్కొంటున్నారు.