తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో యువతిపై ఆరేళ్లపాటు పెద్దనాన్న, అన్న అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడు తంగరాజ్ (50) భార్య దివ్యాంగురాలు కావడంతో తమ్ముడి కుమార్తెను భార్యకు సాయంగా ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్ది రోజులయ్యాక అన్న వరసయ్యే ప్రకాశ్ (30) ఈ విషయం బయటకు చెబుతానని తాను కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించగా పోక్సో చట్టంలో తంగరాజ్, ప్రకాశ్‌ని అరెస్టుచేశారు.