అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా అనారోగ్య సమస్యే అని ఆరోగ్య నిపుణలు అంటున్నారు. గుండె జబ్బులు, క్యాన్సర్ డిమెన్షియా వంటి కారణాల వల్ల అకస్మాత్తుగా తమ బరువును ఎక్కువగా కోల్పోతారని చెబుతున్నారు. బరువు తగ్గడానికి మరో ముఖ్య కారణం ఒత్తిడి అని, డిప్రెషన్ హార్మోన్ల నిర్మాణంపై తీప్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. అకస్మాత్తుగా బరువు తగ్గితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.