బెంగళూరు మెజిస్టిక్ రైల్వే స్టేషన్లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఉద్యాన్ ఎక్స్ప్రెస్కు మంటలు అంటుకున్నాయి. రెండు కోచ్లు మంటలు చెలరేగడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తం అయ్యారు. వెంటనే మంటలను ఆర్పి వేశారు. అయితే రైల్వే స్టేషన్ మొత్తం దట్టంగా పొగ వ్యాపించింది. అగ్ని ప్రమాదంతో స్టేషన్లోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రాణనష్టం ఏర్పడలేదని, ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు పేర్కొన్నారు.