దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉందని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) ఛైర్మన్ వివేక్ దెబ్రాయ్ అభిప్రాయపడ్డారు. ఓ జాతీయ పత్రికలో ఆయన సంచలనాత్మక వ్యాసం రాశారు. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం వలస వారసత్వానికి చెందినదని పేర్కొన్నారు. 1950లో వచ్చిన రాజ్యాంగంతో దీర్ఘకాలం కొనసాగలేమని, అందుకే రాజ్యాంగ సవరణలు చేసుకున్నామని వివరించారు. ఆయన అభిప్రాయాలతో తమకు సంబంధం లేదని 'ఈఏసీ' పేర్కొంది.