ఏపీలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.