చాలామంది తమ స్మార్ట్ ఫోన్ కవర్ లోపలివైపు కరెన్సీ నోట్లు పెడుతుంటారు. అయితే ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఫోన్‌ను నిరంతరం ఉపయోగిస్తున్నప్పుడు అది వేడిగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో ఫోన్ కవర్‌లో రసాయనాలతో తయారుచేసిన కరెన్సీ నోట్లు ఉన్నట్లయితే, ఫోన్ నుంచి వేడి బయటకు విడుదల కాదు. దీంతో ఆ ఫోను పేలిపోయే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.