ఎసిడిటీని దూరం చేసుకోవాలంటే జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. స్మోకింగ్ చేయడం మానేయాలి. ఆహారాన్ని తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. మసాలాలు ఉండే ఫుడ్, ఫాస్ట్ఫుడ్ తినొద్దు. రోజూ ఒకే టైం కి తినడం అలవాటు చేసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆల్కహాల్ తాగొద్దు. పులుపు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినకూడదు. పచ్చళ్లను, నూను వంటకాలను ఎక్కువగా తినొద్దు.