స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లి.. గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా యో-యో ఫిట్‌నెస్ టెస్ట్ స్కోర్‌ను వెల్లడించడం బీసీసీఐను కలవరపెట్టింది. రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ఆటగాళ్లు ఇలా సామాజిక మాధ్యామాల్లో పంచుకోవడం ఒప్పంద ఉల్లంఘన కిందకే వస్తుందని బీసీసీఐ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని వెల్లడించకూడదని భారత క్రికెటర్లందరికీ కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa