బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చెరుకుపల్లి మాజీ ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రకటించిన జిల్లా కార్యవర్గంలో చెన్ను కోటేశ్వరరావుకు ప్రధాన కార్యదర్శిగా స్థానం దక్కింది. చెన్ను కోటేశ్వరావు గుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ గా, ఎంపీపీగా పనిచేశారు. తన నియామకానికి కృషి చేసిన ఎంపీ మోపిదేవి వెంకటరమణ కి కృతజ్ఞతలు తెలిపారు.