టమాటా జ్యూస్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపు చేయడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుందని అంటున్నారు. టమాటా జ్యూస్ తాగే వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, ఎముకల బలానికి ఇది బాగా పనిచేస్తుందని తెలుపుతున్నారు. క్యాన్సర్ వచ్చే లక్షణాలను తగ్గిస్తుందని పేర్కొంటున్నారు.