జామ కాయను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామ కాయలు తింటే మలబద్దకం సమస్యకు చెక్ పెట్టవచ్చు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జామకాయ ఒత్తిడిని, బరువును తగ్గిస్తుంది. మధుమేహాన్ని కూడా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సీ, ప్రోటీన్లు, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.