ఒంట్లో కాస్త నలతగా ఉంటే చాలు.. వెంటనే పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటాం. అయితే దీన్ని అధికంగా వినియోగిస్తే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు. పారాసెటమాల్ అధికంగా వినియోగించడం వల్ల కాలేయం వైఫల్యానికి దారి తీస్తుంది. ఈ ట్యాబ్లెట్ ను అధికంగా ఉపయోగిస్తే శరీరంపై చెడు ప్రభావం చూపుతాయి. దీని ప్రభావం సుదీర్ఘకాలంపాటు శరీరానికి హాని తలపెడుతుంది.