ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రవేశాల గడువు తేదీని విద్యాశాఖ పొడిగించింది. 2023-24 విద్యాసంవత్సరంలో మొదటి ఏడాది ఇంటర్ ప్రవేశాలకు సెప్టెంబరు 16 వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా ఆదేశాల మేరకు సెప్టెంబరు16వరకు మొదటి ఏడాది ఇంటర్లో ప్రవేశాలకు విద్యార్థులను అనుమతించాలని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్, కాంపోజిట్ డిడ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించింది.