శరీరానికి అవసరమైన పోషకాల్లో డి-విటమిన్ ఒకటి. ఉదయం పూట ఎండలో కొన్ని నిమిషాలు నిలబడితే శరీరానికి కావాల్సినంత విటమిన్-డి పుష్కలంగా అందుతుంది. అలాగే శరీర రోగనిరోధక వ్యవస్థ బలోపేతం కావడంలో డి-విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది. శ్వాసకోశ సమస్యలు, డిప్రెషన్ వంటి మానసిక సమస్యల నివారణలో, కొన్ని రకాల క్యాన్సర్ల అభివృద్ధిని నిరోధించడంలో కీలకంగా వ్యహరిస్తుంది. పుట్టగొడుగులు, పాలు, చేపలు వంటి వాటిల్లో డి మిటమిన్ పుష్కలంగా ఉంటుంది.