శరీరానికి ఖర్జూర చాలా మంచిది. అందుకే వైద్యులు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు ఖర్జూరాలను తినాలని చెబుతుంటారు. ఖర్జూరాలో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బీ6, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు దీన్ని ఖాళీ కడుపుతో తింటే చాలా మంచిదంట. అలాగే ఉదయం తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుందట.