గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. బాదం, వాల్‌నట్స్ వంటివి ఆహారంలో తీసుకోవాలి. వాల్‌నట్స్‌లో ఉండే ఒమెగా-3 గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును బాదం తగ్గిస్తుంది. తాజా పండ్లు, కూరగాయలు తినాలి. రోజూ కాసేపు వ్యాయామం చేయాలి. బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. ఒత్తిడికి లోనవకుండా ఉండాలి. సరిపడా నిద్రపోవాలి.