ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కు భారీ షాక్ తగిలింది. యూజర్ల అనుమతి లేకుండా వారి మ్యాప్స్, లొకేషన్స్ ట్రాక్ చేస్తుందన్న ఆరోపణలతో 93 మిలియన్ డాలర్ల (సుమారు రూ.7 వేల కోట్లు) ఫైన్ చెల్లించనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. యూజర్ల డేటాను సొమ్ము చేసుకుంటుందని ఆరోపిస్తూ గూగుల్ పై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా దావా వేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందున ఫైన్ వేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.