యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ లైనప్లో మొత్తం నాలుగు ఐఫోన్లను కంపెనీ లాంచ్ చేసింది. వీటి అమ్మకాలు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానుండగా.. ప్రస్తుతం పలు ఈ-కామర్స్ సంస్థలు ఆఫర్లను ప్రకటించాయి. అమెజాన్, క్రోమాలో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.5వేల ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. క్రోమాలో ఏదైనా పాత ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ.6వేల వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.