భారత్‌లో వ్యాపారుల కోసం వాట్సప్ మాతృసంస్థ మేటా మరో కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్, వాట్సప్ చాట్‌లోనే పేమెంట్‌ను సైతం పూర్తి చేసే సదుపాయం తీసుకొస్తున్నట్లు మెటా వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్‌బర్ తెలిపారు. అలాగే కొత్తగా వాట్సప్‌లో ‘ఫ్లోస్’ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సదుపాయం ద్వారా చాట్ థ్రెడ్స్‌లోనే వినియోగదారులకు కావాల్సిన సేవలను అందించొచ్చని పేర్కొన్నారు.