నిమ్మరసం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నిమ్మలో విటమిన్ సి, ఈ, బి6, థయామిన్, నియాసిన్, రైబోప్లేవిన్, ఫోలేట్ వంటి పోషకాలుంటాయి. ఉదయాన్నే నిమ్మరసం తీసుకుంటే వాపులు, దీర్ఘకాలిక నొప్పులు తగ్గుతాయి. నిమ్మరసం జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుంది. మలబద్ధకం సమస్యకు చెక్ పెడుతుంది. విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. నిమ్మరసం తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.