భారత్ నుంచి చేస్తున్న ఎగుమతుల్లో మొట్టమొదటిసారి యాపిల్.. శామ్సంగ్ను అదిగమించింది. 2023-24 ఆర్థికసంవత్సరం రెండో త్రైమాసికంలో జరిగిన స్మార్ట్ఫోన్ ఎగుమతుల్లో యాపిల్వే అత్యధికంగా నిలిచాయి. ఈ త్రైమాసికంలో ఇండియా చేసిన మొత్తం 12మిలియన్ల స్మార్ట్ఫోన్ ఎగుమతుల్లో యాపిల్వి 49 శాతం, శామ్సంగ్ ఎగుమతులు 45 శాతంగా ఉన్నాయి. అయితే 2023-24 తొలి త్రైమాసికంలో శామ్సంగ్ ఎగుమతులు 50శాతంగా ఉన్నాయి.