టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. అరెస్ట్‌ను ఖండిస్తూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర్ రావు స్పందించారు. అయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..... ‘‘సంసారులపై బురద చల్లడానికి వ్యభిచారులు ఎల్లప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. అది లైంగిక వ్యభిచారులైనా లేక రాజకీయ వ్యభిచారులైనా!’’ అంటూ నాగేశ్వర్ రావు ట్వీట్ చేసారు.