ప్రస్తుతం వాతావరణ మార్పులతో చాలామంది జ్వరాల బారిన పడుతున్నారు. డెంగీ వ్యాధులతో ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఒళ్లు నొప్పులు, తీవ్ర జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్లేట్ లెట్స్ పెరగాలంటే బొప్పాయి ఆకుల రసం, కషాయం తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వేప ఆకుల్ని నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుందంటున్నారు. 2 గ్లాసుల నీటిలో జామ ఆకులు మరిగించి గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగాలంటున్నారు.