ప్రతి రోజూ ఖాళీ కడుపుతో మెంతి నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మెంతుల్లో ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ ఎ, బి6, సి, కె వంటి పోషకాలు ఉంటాయి. దీని వల్ల మెటబాలిజం మెరుగ్గా పెరుగుతుంది. జీర్ణక్రియ, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. మొటిమలు, కళ్ళ చుట్టూ నల్లటి వలయాలను పోగొడుతుంది.