ప్రతి ఒక్కరూ మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఉదయాన్నే కొంతదూరం వాకింగ్ చేయడం ఎంతో ఉత్తమం. ఇలా చేయడం వల్ల మీరు బరువు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా వాకింగ్ చేయడం వల్ల మీ మెదడుకు రక్త ప్రసరణ కూడా పెరిగి ఉత్సాహంగా ఉంటారు. మెదడు పనితీరు మెరుగవడంతో ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఉదయాన్నే వాకింగ్ చేస్తున్నప్పుడు మీ శరీరానికి సూర్యరశ్మి తగడం వల్ల విటమిన్ 'డి' బాగా అందుతుంది.