ఖలిస్తాన్ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ హత్య విషయంలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలపై శ్రీలంక విదేశాంగ శాఖ మంత్రి అలి సాబ్రి తాజాగా స్పందించారు. ట్రూడో వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తమపైనా ట్రూడో గతంలో జెనికోడ్ ఉందని ఆరోపించారని, అది అసత్యమని అన్నారు. అలాంటి ట్రూడో భారత్‌పై వ్యాఖ్యలు చేయడంలో ఆశ్చర్యమేమీ లేదన్నారు. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామమన్నారు.