స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. చంద్రబాబు పిటిషన్‌ను బుధవారం విచారించేందుకు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అంగీకరించారు. కాగా, ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. అయితే షేడ్యూల్లో మార్పుల కారణంగా ఈ పిటిషన్‌ను ఈ రోజు మెన్షన్ లిస్ట్‌లో చేర్చలేదు.