పదేపదే జుట్టుని కడగడం వల్ల.. జుట్టు పొడిగా మారిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిపుణుల సూచనల ప్రకారం.. జుట్టు తత్వాన్ని బట్టి తలస్నానం చేయాలి. భరించలేనంత జిడ్డుకారుతుంటే రోజూ తలస్నానం చేయాలి. పని ప్రదేశంలో బాగా చెమటలు పడుతుంటే రోజూ తలస్నానం చేయాలి. అయితే షాంపుతో కాకుండా సాధారణ నీటితో తలను కడగాలి. ఇలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ తలస్నానం చేస్తే కురులు ఆరోగ్యంగా అందంగా ఉంటాయి.