శరీరంలో వచ్చిన కొన్ని మార్పులు మనకు డయాబెటిస్ ఉందనే సంకేతాలను పంపుతాయి. తరచూ మూత్రం రావడం, తిన్న వెంటనే ఆకలి వేయడం, నిస్సత్తువ ఆవహించడం, పదే పదే దాహం వేయడం, గాయాలు ఎంతకూ మానకపోవడం, కంటి చూపు తగ్గడం వంటివి కనిపించగానే అప్రమత్తం కావాలి. ఇది ముదరక ముందే డాక్టర్ల సూచనలు పాటించడం, వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకుంటే ముప్పు తప్పుతుంది.