అమెరికా-చైనాల మధ్య ‘తప్పుడు సమాచారం’ పై మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ కు చెందిన కీలక సమాచారాన్ని చైనా హ్యాకర్లు తస్కరించినట్లు అమెరికా ఓ నివేదికను బహిర్గతం చేసింది. అంతే కాకుండా చైనా చేస్తున్న అసత్య ప్రచారాలకు సంబంధించి ‘గ్లోబల్ ఎంగేజ్ మెంట్ సెంటర్’ పేరుతో ఓ నివేదికను అమెరికా విడుదల చేసింది. తాజాగా దీనికి సంబంధించి చైనా స్పందిస్తూ అమెరికా చేసిన ప్రకటన ఓ తప్పుడు ప్రచారమంటూ ప్రతి విమర్శకు దిగింది.