మేషం: దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాల విస్తరణకు నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
వృషభం: ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయటా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దైవ చింతన కలుగుతుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
మిధునం: గృహమున కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారమున లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగ సమస్యలు తొలగుతాయి. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.
కర్కాటకం: ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. బంధువులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా రాణిస్తారు.
సింహం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించనప్పటికి అవసరానికి ధనం అందుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి.
కన్య: భూ సంభంధిత వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి.
తుల: చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఊహించని రీతిలో నిరుద్యోగులకు అవకాశములు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్నది సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.
వృశ్చికం: నూతన భూ గృహ యోగమున్నది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండిబాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కారమౌతాయి.
ధనస్సు: ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. రుణదాతల ఒత్తిడితో నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన శిరోబాధను కలిగిస్తుంది.
మకరం: కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అనుకున్న వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో రావలసి అవకాశాలు చేజారుతాయి.
కుంభం: వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తు లాభలు పొందుతారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అదిగమిస్తారు.
మీనం: చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. బంధువులతో మాటపట్టింపులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున కొన్ని వ్యవవహారాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.