పేకాట ఆడుతున్న 5మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు, తవణంపల్లి ఎస్సై సుధాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తవణంపల్లి మండలం, గల్లకొండ ప్రక్కన నిషేధిత పేకాట ఆడుతున్నట్లు వచ్చినరహస్య సమాచారమేరకు మెరుపు దాడులు నిర్వహించామన్నారు. బంగారుపాల్యం మండలానికి చెందిన 5 మందిని అరెస్టు చేసామన్నారు. రూ. 14, 620 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa