కరివేపాకును నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇక రక్తలేమి సమస్యను కరివేపాకు దూరం చేస్తుంది. ఇందులో ఐరన్ అధిక మోతాదులో లభిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరిచే విటమిన్-ఏ కూడా విరివిగా ఉంటుంది. డయాబెటిస్ రోగుల్లో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులోని కాల్షియం ఎముకలను బలంగా మార్చుతుంది.