భారత్-అమెరికా మధ్య సంబంధాలు బలపడటానికి ముఖ్య కారణం భారత కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అని అమెరికా పేర్కొంది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో జరిగిన సమావేశంలో అమెరికా స్టేట్ ఫర్ మేనేజ్ మెంట్ అండ్ రిసోర్స్ డిప్యూటీ సెక్రటరీ రిచర్డ్ వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్‌కింగ్ వంటి గొప్ప వ్యక్తుల వల్ల ఇరు దేశాలు మిత్రులుగా మారాయన్నారు. ఈ మైత్రిని ఇలా కొనసాగించడంలో జైశంకర్ ను ఆధునిక రూపకర్తగా ఆయన అభివర్ణించారు.