చాలామంది కూలర్లు, ACలు వాడుకుంటున్నారు. అయితే, AC ఎక్కువగా వాడితే పిల్లలు, పెద్దలకు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ACలో ఎక్కువ సమయం గడిపితే త్వరగా అలసట చెందినట్లు ఫీల్ అవుతారు. కొందరికి చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. డీహైడ్రేషన్ కు గురై బయటకు వెళ్తే సమస్య వచ్చే అవకాశం ఉంది. గొంతు సంబంధిత సమస్యలు రావొచ్చు. కాబట్టి నిరంతరం AC ఆన్ చేయకుండా అప్పుడప్పుడూ ఆఫ్ చేయాలి.