చాలా మంది డైట్ పేరుతో రాత్రిపూట భోజనాన్ని మానేస్తూ.. టిఫిన్స్ లేదా ఫ్రూట్స్ తింటున్నారు. అయితే రాత్రిళ్లు ఇడ్లీ, దోశ లాంటివి తినడం ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పులియబెట్టిన ఆహారం జీర్ణశక్తికి మంచిదే అయినప్పటికీ అసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రుళ్ళు పులియబెట్టిన ఆహారాన్ని తీసుకోవకపోవడమే మంచిదని చెబుతున్నారు.