వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శీతాకాలంలో శ్వాసకోశ మరియు జీర్ణ సంబంధిత వ్యాధులకు చెక్ పెడుతుంది. వెల్లుల్లిలో కాల్షియం, ఐరన్, విటమిన్-సి, బి6, మెగ్నీషియం, సెలీనియం మరియు పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లిలోని యాంటీ వైరల్ గుణాలు దగ్గు, జలుబు తగ్గుతాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. చలికాలంలో వచ్చే అలర్జీలకు వెల్లుల్లి చెక్ పెడుతుంది.