టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మైదుకూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు మైదుకూరు టిడిపి నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మంగళవారం నాటికి ఈ దీక్షలు 28వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాజీపేట మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.