మేషం: సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో చికాకులు తప్పవు.
వృషభం: సోదరులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు శ్రమాధిక్యంతో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది.
మిధునం: వాహనయోగం ఉన్నది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. స్థిరస్తి క్రయ విక్రయాలలో పురోగతి కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు కలుగుతాయి.
కర్కాటకం: కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి.
సింహం: వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
కన్య: ఒక వ్యవహారంలో బంధువర్గంతో మాటపడవలసి వస్తుంది. దైవచింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
తుల: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు తప్పవు. ఆస్తుల వివాదాలు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు తప్పవు. మిత్రుల వలన సమస్యలు కలుగుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వాయిదాపడతాయి.
వృశ్చికం: సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. సంఘములో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాలలో ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
ధనస్సు: విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.
మకరం: కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సోదరులతో స్థిరస్తి ఒప్పందాలు చేసుకుంటారు. మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి.
కుంభం: ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. సన్నిహితుల నుంచి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి.
మీనం: కుటుంబ సమస్యల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. దైవచింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.