మన శరీరంలో కిడ్నీల అతి ముఖ్యమైన అవయవాలు. కిడ్నీలు రక్తంలో ఉండే ఉప్పు, ఇతర చెత్తను బయటకు పంపి రక్తాన్ని శుభ్రం చేస్తాయి. కిడ్నీలలో ఒక్కోసారి చెత్త పేరుకుపోయి రాళ్లు ఏర్పడతాయి. అయితే ఇంట్లో ఉపయోగించే వస్తువలతో కిడ్నీలను శుభ్రం చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక కొత్తిమీర కట్టను తీసుకుని చిన్నగా తరగాలి. తరిగిన కొత్తిమీరను గిన్నెలో వేసుకొని మంచినీరు పోసి 10 నిమిషాలు వేడి చేయాలి. చల్లారాక ఈ రసాన్ని ఒక గ్లాసుడు చొప్పున తాగాలి. ఇలా వారానికి కనీసం ఒకసారైనా తాగాలి. అలా చేయడం వల్ల కిడ్నీలో ఉండే చెత్త తొలగిపోయి, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.